వెన్నెల రేల
వెన్నెల రేల
వెన్నెలరేల కురిసే వెలుగుల నీ తలపేమొ తెలుపవ
ఆసులో దారంలా తిరిగే నీ వగపేమొ తెలుపవ
నింగిలోని చుక్కల్లె మిలమిల మెరుస్తుంటావు నీవు
చెలిమి అండనై నేనుండగా నీ తగవేమొ తెలుపవ
మౌనంగా విరిసె మమతా మల్లి నీవు మనసౌతావు
అందము గంధము నందమౌ నీ మది తపమేమొ తెలుపన
ఏ పొద్దు నీ సుద్దే నా ముద్దౌతు మరులు మీరితే
హద్దె లేని ఆకసపు అంచులొ నీ తపనేమొ తెలుపవ
మబ్బులెన్ని మూగినా మొగులుదారిని మూయ లేవుగా
మల్లీ! నన్నే వలచి దాచిన ఎద వలపేమొ తెలుపవ
