STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆనందం

ఆనందం

1 min
1


కోపం నాపై కోపం..చూపెనంటె ఆనందం..!
చూడగ చెలి అలుకయె..రాలెనంటె ఆనందం..!

'పరాభవ' సంరంభం..జరుగుతోంది క్షిపణులతో..
యుద్ధకాంక్షలను తెఱలే..కాలెనంటె ఆనందం..!

హరితభరిత వాసంతిక..హాసమదే క్షేమకరం..
కాపాడే హితవరులే..ఉండెనంటె ఆనందం..!

ప్రేమాస్పద హృదయాలే..భగవానుని దేవళములు..
సకలజీవ సాక్షిగాను..మిగిలెనంటె ఆనందం..!

చంపాటను చాలించక..శాంతికేది అవకాశం..
ఆకాశపు సందేశం..అందెనంటె ఆనందం..!

చదువులతో మేధపెరిగి..జగతికెంత మేలుచేసె..
ఎఱుకలోన మనిషితనం..నిలిచెనంటె ఆనందం..!


Rate this content
Log in

Similar telugu poem from Classics