నీలినీడ
నీలినీడ
చెలి కన్నుల లోయలలో..పొంగాడే నీలినీడ..!
మనసు విప్పి మాటాడగ..మరులాడే నీలినీడ..!
కనిపించని వేదనకో..కావ్యరూప మివ్వలేదు..
తనలోనే తనతోనే..పోరాడే నీలినీడ..!
చిందాడే ముచ్చటలో..చేరలేదు దూకలేదు..
సంశయాల లోగిలిలో..చెరలాడే నీలినీడ..!
చిన్నిపాప తానగునే..తగవాడగ తలచలేదు..
నిదురలేని తోటలోన..కదలాడే నీలినీడ..!
ప్రేమకడలి నేలజూచు..జాబిలిగా మారేనది..
దృశ్యాలను కరిగించగ..తిరుగాడే నీలినీడ..!
ఉరుమాడగ చూడలేదు..ఎగతాళియె చేయలేదు..
తుడుమాడే కోమలాంగి..ముద్దాడే నీలినీడ..!
