STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆ పక్షి స్వేచ్ఛ నాకు కావాలి

ఆ పక్షి స్వేచ్ఛ నాకు కావాలి

1 min
1


ఆ పక్షి రెక్కలతో నింగిలో విన్యాసాలు చేస్తూ,
చుట్టూ తన సామ్రాజ్యాన్ని సృష్టించుకొని,
స్వేచ్ఛగా గెంతులు వేస్తూ..
లోకాన్ని జయించానన్న ఆనందంతో ఎగురుతుంది.

జొన్న చేనుపై వాలి, అమితంగా కంకిపై ఆగి,
చిట్టి ముక్కుతో సంబరం చేస్తూ..
కొన్ని గింజలను నోట పట్టి తింటూ,
చుట్టుపక్కల గింజలను విసురుతూ విందు చేస్తుంది.

కొమ్మ చిగురంచులను అందుకోవడానికి,
వయ్యారంగా రెక్కలను ఆడిస్తూ..
ఒళ్ళంతా నిలువునా విరుచుకుంటూ,
లేత ఆకు రుచులతో కొత్త రాగాలను వినిపిస్తుంది.

ఉల్లాసంతో నింగిలో ఎగురుతూ,
సూర్యోదయానికి స్వాగతం పలుకుతూ..
సూర్యాస్తమయానికి వీడ్కోలు చెబుతూ,
ఆకాశానికే అందమైన నవ వర్ణాన్ని అద్దుతుంది.

కుత్సిత బుద్ధితో పంజరం పాలు చేసి,
బంగారపు చువ్వల మధ్య హృదయాన్ని ఉంచి..
ఈ ఖరీదైన బతుకుల్లో మనిషి ముంచిన తీరు,
ఆ స్వేచ్ఛా రెక్కలను నిలువునా నరికినట్లే కదా!

స్వాతంత్రాన్ని ఎక్కడో తాకట్టు పెట్టకుండా,
పంజరపు సందుల్లో ముక్కును ఉంచకుండా..
ఆశల నింగి పల్లకిపై ఆత్మస్థైర్యంతో,
రెక్కల అడుగుల చప్పుడు వింటూ ఉండాలి.

యథేచ్ఛగా కొమ్మ కొమ్మకూ ప్రాకుతూ,
కమ్మని కంఠంతో కూనిరాగాలు తీస్తూ..
నేలపై నాలుగు గింజలను గుటకలేస్తూ,
నింగికి, చెట్టుకు చుట్టంలా నేను ఉంటే బాగుండు..


Rate this content
Log in

Similar telugu poem from Classics