Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Classics

4  

Midhun babu

Classics

ఆడదాన్ని నేను

ఆడదాన్ని నేను

1 min
362


కాలం కోరల్లో కాలే సమిధను నేను 

ప్రళయాగ్నిలో మాడి మసి అవుతున్న మౌనాన్ని నేను 

కట్టుబాట్లకు ఉక్కుసంకెళ్ళకు బానిసను నేను

మనసు చంపుకున్న నిశ్శబ్ధాన్ని నేను  

ఆకలి బాధ తెలియని ఆడదాన్ని నేను 

గడ్డి పువ్వైనా మనసువున్నా చంపుకున్న మగువను నేను 

నిత్యం శ్రామికురాలిని కాలం మారక పోతుందా అన్న ఆశ బ్రతికే వుందే

మనసున వున్నా ధ్యానిస్తున్నా కాలమా జాలి చూపి కరుణించవా

ఆడదాన్ని అబలను నేను చీకటిలో మగ్గుతున్న కట్టెను నేను 

కెరటంలా ఎగసిపడుతున్నా తీరాన్ని తాకాలని ఆరాటామే

పయనించే దారి ముళ్ళదారి సహనం శాంతం ఓపిక ఆభరణమే

కంటినిండా కన్నీటి చారికలే ఒంటరి దానిలా ఒడ్డుకు చేరెదెలా

ఆడదానిలాపుట్టడమే శాపమా కన్నీటి బ్రతుకు

కలకాని బ్రతుకు చీకటి బ్రతుకు కాలం ఒడిలో సమిధను

నేను ఆడదాన్ని నేను శాపాన్ని నేనూ...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Classics