STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మాటలు

మాటలు

1 min
2


ఆలోచన సాక్షి కాగ..నవ్వుతున్నవి మాటలు..! 
తిరుగులేని ఓ నదిలా..మారుతున్నవి మాటలు..! 

మల్లెలు ముళ్ళై గుచ్చే..పనిలో మునిగేనెలాగ.. 
ఒకపాటన ఇమడాలని..పొంగుతున్నవి మాటలు..! 

జీవితమేం పోరాటం..కాదన్నది రుజువైనది.. 
పంచరాని మధురిమలో..ఆగుతున్నవి మాటలు..! 

దిగులుపిట్ట రాగాలను..అనువాదం చేస్తూనే.. 
నీలికనుల నీడలలో..కదులుతున్నవి మాటలు..! 

ప్రశ్నించని సఖుడెవరో..పిలుస్తున్న వేడుకలో.. 
లోవెన్నెల వానలోన..నిలుపుతున్నవి మాటలు..! 

సమాజాన్ని పీడించే..జబ్బులెలా మాన్పలో.. 
సాధనలో శోధనలో..రగులుతున్నవి మాటలు..! 



ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More telugu poem from Midhun babu

Similar telugu poem from Classics