STORYMIRROR

Dr.S.Veenadhari

Classics

4  

Dr.S.Veenadhari

Classics

అక్షరాంజలి

అక్షరాంజలి

1 min
287

ఓ జగజ్జనని

నిర్వికారం నీ రూపం!

సుమధుర సుమనోహరం నీ నామ స్మరణం!

నా మానసవీణ నుంచి జాలువారే

కమనీయ కవితా రస ఝరులు

నీ కరుణా కటాక్షణ ఫలములే!

నా హృదయాంతరాలలో

నిరంతరం ఉప్పొంగే

కవితా పద విన్యాసాన్ని

అక్షర సుమ మాలలుగా కూర్చి

అంకిత మిస్తున్నాను నీ పాద పద్మాలకు !

అందుకో తల్లీ!

నా ఈ వినమ్ర అక్షరాంజలి !!!!!


Rate this content
Log in

Similar telugu poem from Classics