జీవన గమనం
జీవన గమనం
జీవన గమనం
ఓ మనసా ఉవ్వెత్తున ఎగసిపడకే
సాగర తీరం లో అలలవలె
జీవన సాగర మధనం
తీరంలో నే ఆగిపోతే ఎలా!
సుదూర ప్రయాణం లో
సుడిగాలుల ఆటుపోట్లు ఎన్నెన్నో !
కోరికల రెక్కలతో నింగికి ఎగిరితే
ఆవలి తీరం చేరలేవు సుమా!!
జీవన గమనం లో అలజడి అంతా తీరంలోనే .....
నడి సంద్రం నిశ్చలం ....
గమ్యం ఎరిగి పయనిస్తావో
గమ్యమే లేక అలసిపోయి
మధ్యలోనే ప్రయాణం ముగిస్తావో
నిర్ణయం నీదే సుమా!!!!
