STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

రాధా మాధవ

రాధా మాధవ

1 min
2


ఉచ్ఛిష్టం నీమోవీ మధురమే పుష్పముండు
నాసొంత విరితేనియ తెట్టే రాధా రమణి
మాధవీ మరాళమై మంగళీ మనోహరీ 
మానసీ ననుజేరిన శాంభవీ శివగామిని
ప్రియమాయె జతగూడగ రంజనీ ఋతుగామిని
కళ్యాణి నేచేయగ పనులేమొ చెప్పుసుమా 
నీపాద స్పర్షతోడు నీకన్ని యెరుకేలే
నీపాద పీఠమునా నాకంటు జాగునివ్వు
నీపూజ ననుజేయా నాకివ్వ వీలునివ్వు
నాయందు నీదయనూ విడువంగ నిలవనివ్వు
సర్వాత్మ రాధాత్మా రాధికవు మహాత్మవూ
నీపూజ నేజేయూ అంతరాత్మ పరంధాము
పరమేష్ఠి పరంజ్యోతి కామేష్ఠి కరుణదాయి
నీకరుణ నేనుంటిని ఈప్సితము తీర్పనుర్వి 
మాధవా మధుసూధన మాయలే నీవంటే
నీదరికి వచ్చిననా నెందుకీ సమార్చనా
నీపొందు నీయవయా దేవకీ నందనుడా
నీయందు మనసాయే ఆనంద మన్మధుడా 


Rate this content
Log in

Similar telugu poem from Classics