STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నా ప్రయాణం

నా ప్రయాణం

1 min
1



సమరం చేయలేను.
సంద్రాన్ని దాటలేను.
రక్తపాతం సృష్టించను.
రాజ్యాలు కావాలని కోరాను.

హింసలు వ్యతిరేకం నేను.
అహింసే నా ఆయుధం.
కాపాడుకుంటాను అందరిని.
రక్షిస్తాను శతృ ముఖాల నుండి.

చిమ్మ చీకటి జీవితాల్లో వెలుగులు పంచుతాను.
బానిసత్వాన్ని బద్దలు కొడతాను.
స్వేచ్ఛ కోసం పోరాడుతాను.
అందరి కోసం శాంతి మాత్రాన్ని జపిస్తాను.

అందరు బాగుండాలి అనే ఆరాటం.
అలసిపోనిది నా ప్రయాణం.
ఆగిపోనీయాను నాలోని భావాల్ని చివరివరకు...

               


Rate this content
Log in

Similar telugu poem from Classics