ఉంది
ఉంది
అలలు ఆగితే సముద్రస్నానం..చేయాలని ఉంది..!
యుద్ధాలే ముగిస్తే సైన్యంలో..చేరాలని ఉంది..!
చదవుతూనే పోవాలంటారేం..బతికినన్నాళ్ళూ..
పరీక్షలంటూ లేవంటేనే..చదవాలని ఉంది..!
ఎన్నికలొచ్చి పోతుంటే పాపం..బాగెవరు పడిరో..
దోపిడీ తెలియని వారికే ఓటు..వేయాలని ఉంది..!
ఎండ,వాన,ౘలి..ఏంకాలాలో..పన్లెలా చేయను..
కాలమేది లేనపుడే పన్లోకి..వెళ్ళాలని ఉంది..!
విచారం ఏం చేయను..ఎవరికోసమని బాధపడను..
బంధాలకు విడాకులు ఇచ్చేసి..బ్రతకాలని ఉంది..!
ఎన్నిరుచులు ఎన్ని పాకాలురో..ఎన్ని వంటకాలు..
వాసనలు తప్పుకుంటే ధ్యానం..చేయాలని ఉంది..!
