మౌనం
మౌనం
ఆలోచనలు సుడిగుండాలైతే
అల్లకల్లోల సముద్రాన్ని మౌనం కవ్వంతో చిలకాలి
పొల్లు మాటలన్నీ పొట్లం కట్టి కాల్చేయాలి
సొల్లు కబుర్లన్నీ కాలుష్యం కాకుండా పాతేయాలి
యుద్ధం చేసేముందు లక్ష్యం అంచనా వేసేందుకు
మౌనం దాల్చి కాల్చేయాలి పనికిమాలిన పదాల్ని
పదిమంది పేకాట ముక్కల్లా మాటలు పరుస్తుంటే
శ్రమ దోపిడీకి బాటలు వేస్తుంటే
రక్త ప్రవాహాలకు బీజాలు వేస్తుంటే
చెత్తకుండీలా భరించే మౌనాన్ని ఆశ్రయించొద్దు
కాల్చాల్సిన మాటల్ని కాల్చి
పెట్టాల్సిన వాతల్ని పెట్టాలి
పేల్చాల్సిన తుపాకుల్ని పేల్చాలి అడ్డుకట్టపడేలా
అక్షరాల శిల్పం చెక్కేముందు బండరాయిని తొల్చాలి
ఇక్కడ ఏ ఉలి వాడాలో ఉండాలి అంచనా
శిల్పానికి మిగిలే రాయి కంటే
ఎక్కువ కావచ్చు ముక్కలు ముక్కలయ్యేదే
నిర్దాక్షిణ్యం, నిరంకుశత్వం కావాల్సిందే అక్కడ
చాకచక్యం చక్కనిదైతే ముక్కలైన రాళ్లతో గద్దె నిర్మాణం
మౌనం మహిమాన్వితంగా మారాలంటే
పదునెక్కిన ఉలి చిన్నదే అయినా
వాడాల్సిన చోట వాడాలి తిరుగులేని ఆయుధంగా
మౌనం వాడితే శక్తివంతమైనది
వీడితే నిరర్థకమైన మాటల పుంజు
మనల్ని మనం పుటం పెట్టుకోవడానికి
మౌనం కొలిమిలా మారాలి
మనిషిని మేల్కొల్పాలి, మేల్కొల్పాలి
మౌనం అంటే విరామం, విశ్రాంతి
కావాలి పునరుత్తేజానికి సోపానం
వృధాగా మారిస్తే నేరాల బండను మోయడమే
చేతగానితనాన్ని తలరాతగా భావించడమే
చిన్న మీటును వాడితే పక్కకు దొర్లుతుంది బం
