STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కాలం ఓం మంత్రగతై

కాలం ఓం మంత్రగతై

1 min
1



మనుషుల్లో కొందరికి కాలం ఓ మంత్రగత్తే
అదే మరికొందరికి కాలం ఓ మాయావి
ఇంకొందరికి కాలం గొప్ప మాయలోడు
లింగమేదైనా కాలమొక బహు మొనగాడు 

ఎపుడైనా చరిత్రలో కాలానిదే పై చేయి 
రాజులు, రాజ్యాలు ఏవైనా కాలానికి లోబడి 
కాల గమనంలో ఎవరైనా కలువాల్సిందే
యావత్ పరిణామాలకు కాలమే సజీవ సాక్షి

నిశ్శబ్దపు నీడలలో నడిచే ఓ అదృశ్య శక్తి
అడుగుల మోత వినిపించదు, కనిపించదు 
కాని ప్రతి శ్వాసలో ఆమె స్పర్శ అనుభూతి
కాలంతో పరుగెడితేనే ఉఛ్వాస నిశ్వాసాలు 

ఏదైనా నిన్న శాశ్వతమని అనుకున్నది
ఇవాళ అది ఒక మిగిలే జ్ఞాపకం మాత్రమే
ఇవాళ అనుభవించిన ఆనందం, సంతోషం 
రేపటికి కేవలం అది గత స్మృతి మాత్రమే 

అహంకారపు ఎత్తుపల్లాలను అణచివేస్తుంది 
పొగరును ఒక క్షణంలో ధూళిగా చేస్తుంది
బాధలను సహనపు తీరాలకు చేర్చుతుంది
కష్ట నష్టాలను కడుపులో దాచుకుంటుంది 

కాలంతో రాజ్యాలు, వెలుగులు, విజయాలు
అన్నీ ఆమె మాయలోని చిన్న చితక తరంగాలే
కాల గమనంలో రువ్వడిగా ఎగసిపడే కెరటాలు 
ఉత్తాన్న పతనాలు కాలానికి షరా మామూలే 

ఎందుకంటే, కాలం ముందు అన్నీ ఉత్తవే
గర్వం కూడా మౌనమే, సంపద కూడా నీడే
శక్తి కూడా క్షణికమే, బాహుబలులైనా వీడే
పామరుల నుండి పండితుల దాకా ఒకటే 

అయితే అదే కాలం ఒక గొప్ప గురువు 
ఓటమిలో, పతనాల్లో పాఠాలు చెబుతుంది
నష్టాల్లో కళ్ళు తెరిపించి నిజం చూపిస్తుంది
నిశ్శబ్దంలో మౌనంగా బతుకు అర్థం నేర్పిస్తుంది

జనన మరణాలు అన్నీ యాదృచ్ఛికం 
మధ్యలోని ప్రయాణం మాత్రం సాదృశ్యం 
జీవితాన్ని కాలం మర్మంగా మార్చుతుంది
కాలం వేగంతో మనిషిని పరుగులు పెడుతుంది 

అందుకే మనిషీ కాలాన్ని జయించలేడు
కానీ కాలంతో కలిసి నడిస్తే కరుణించ వచ్చు 
మనిషి జీవితం ఒక సత్యంగా మారుతుంది
కాలం మాయలో వచ్చి పోయే చిన్న క్షణాలమే !


Rate this content
Log in

Similar telugu poem from Classics