STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆ సంద్రాన్ని

ఆ సంద్రాన్ని

1 min
14



నా కళ్ళ ముందు సముద్రముంది.
నాలో దాగుంది ఆ సంద్రం.
ఎంత లోతులో ఉన్నానో తెలియదు
కెరటాలై ఎగసిపడుతుంది దేహం.

అప్పుడప్పుడు మౌనం గా ఉంటుంది.
అప్పుడే కోపం తో భయపెడుతుంది.
లోపల అన్ని దాచుకొని పైకి ఏం తెలియనట్లుగా
అలా ఉండిపోతుంది.
చూస్తున్నా కొద్ది చూడాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ.

ఆ సముద్రం బాధ నా బాధ ఒక్కటే.
కోపాన్ని దాచుకుంటుంది.
నటిస్తున్నాం కొండంతా బాధను దాచుకొని
పైకి నవ్వుతున్నట్లు నటిస్తున్నాం.

ఎదురు ఎదురుగా ఉన్నా అలానే ఉండిపోతున్నాం.
ఊపిరి ఉన్నాని రోజులు ఇదే వేదన.
కంట తడి కనిపించకుండా మోయాలి భారం
మౌనం గా మరిపోతున్నాం.
అలానే గడిపేయాలి జీవితం కడవరకు.
నాలోనే దాచుకున్న ఆ సముద్రాన్ని నాకు నేను గా.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics