జీవితం
జీవితం
ఏడుస్తూ కూర్చుంటే..తెలవారక ఉండదులే..!
అందమైన జీవితమే..వదిలేయక తప్పదులే..!
ఊహలలో బతుకదేల..సత్యమేదొ అందాలిక..
దీపముతో చేరక మరి..జీవితమే పండదులే..!
నీ చక్కని చిత్రసీమ..దర్శకుడవు నీవేనోయ్..
సంగతింత ఎఱుకనున్న..బాధేమీ మిగలదులే..!
పాత్రలన్ని తాత్వికులే..నిజభాగస్వాములేను..
మిత్రత్వపు రుచి దొరికిన..ఏ గొడవా జరగదులే..!
పాశాలో మోహాలో..గురు మాయా పాకాలే..
పరవశాల శాల మదియె..తనువేమీ కోరదులే..!
కనులవెనుక దాగుండును..రెచ్చగొట్టు తనమేదో..
దీపముతో చేరకున్న..గుణరాశియె రాలదులే..!
