పలకరింపు
పలకరింపు
పద్యం:
పరుల జూసి దూషించును పరమ శూన్యి
పరుల జూసి పలకరించు పరమ యోగి
పరులదూషణ నిజముగ పాపమగును
బ్రహ్మచారిణి! శారద! భారతాంబ!
భావం:
బ్రహ్మచారిణి! శారదా! తల్లీ భారతీ(సరస్వతీ)! ఇతరులను చూస్తూ ఎల్లప్పుడూ వారితప్పులను ఎత్తి చూపేవాడి బుర్ర శూన్యంగా ఉంటుంది. అదే ఇతరులను చూసి వారితో చక్కగా మాట్లాడే వారు చాలా తెలివి గల వారు. ఇతరులను దూషించడం అనేది నిజముగా ఒక పాపకార్యము అని చెప్పవచ్చును.