STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నిశ్శబ్ద నమ్మకద్రోహం

నిశ్శబ్ద నమ్మకద్రోహం

1 min
1


మాట్లాడుతూనే మనసును చంపేసే విద్య వారికి తెలుసు,
ముసిముసి నవ్వుల వెనుకే విషపు బాణాలు దాచుకుంటారు!
నీ అవసరం ఉన్నప్పుడు అరికాళ్ళను తడిమే వారు,
నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అపరిచితుల్లా మారిపోతారు.
ఖాళీ సమయాన్ని అబద్ధాల బిజీతో కప్పేస్తారు,
నువ్వు పంపే సందేశం వారి కళ్ళముందే ఉన్నా..
చూడనట్లు నటించే ఆ నిర్లక్ష్యం, గుండెను కోసే కత్తి కంటే పదునైనది!
తిరుగు సమాధానం లేని ఆ మౌనం.. వంద తిట్ల కంటే భయంకరమైనది.
"నీకు నేనున్నా" అన్న మాట.. ఒక తీపి విషం!
ఆశ పెట్టి, అర్ధరాత్రి నడిసముద్రంలో వదిలేసి వెళ్ళడమే వారి నైజం.
నువ్వు ఒక్కో మెట్టు ఎదుగుతుంటే వారి కళ్ళు మండుతాయి,
ప్రేమగా హత్తుకుంటూనే, వెనుక నుండి గోతిని తవ్వుతారు.
ఎదుటివాడి కన్నీరు వారికి కేవలం ఒక నీటి చుక్కే,
కానీ ఆ చుక్క వెనుక ఉన్న వేదన వారికి అనవసరం!
మనుషుల రూపంలో ఉన్న ఈ కపట నాటకాలను చూసి,
ఇప్పుడు నమ్మకం కూడా తనని తాను నమ్మడం మానేసింది.
హృదయం లేని వారితో స్నేహం కంటే..
నిజాయితీగా ఉండే ఒంటరితనమే మిన్న!


Rate this content
Log in

Similar telugu poem from Classics