ముసుగుల లోకం
ముసుగుల లోకం
మనుషుల మధ్యన మమకారం మాయమైపోయింది,
నమ్మకద్రోహం ఇప్పుడు నిత్యకృత్యమైపోయింది!
పక్కనే ఉంటూ ప్రాణ స్నేహితుడిలా నటిస్తారు,
అదును చూసి వెన్నులో కత్తి దించుతారు!
ఖాళీగా ఉండి కూడా "బిజీ" అని అబద్ధం చెబుతారు, అవసరం లేనప్పుడు మొహం చాటేస్తారు!
మెసేజ్ చూసినా చూడనట్లు నటించే నిర్లక్ష్యం ఒకవైపు,
తిరిగి జవాబివ్వని ఆ అహంకారం మరోవైపు!
"నీకెందుకు నేనున్నాను" అని భుజం తడతారు, కష్టం రాగానే కాడి వదిలేసి మాయమౌతారు!
నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక కుళ్ళుకుంటారు,
ఎలాగైనా కిందికి తొక్కాలని కుట్రలు పన్నుతారు!
నోరు తెరిస్తే చాలు.. అన్నీ కల్లబొల్లి మాటలే,
నవ్వు వెనుక దాగున్నవన్నీ విషపు ఆలోచనలే!
అందలం ఎక్కే వరకు అందరూ నీవారే అంటారు,
అవసరం తీరాక అపరిచితుల్లా మారిపోతారు!
గుండె కోతను కూడా గమనించని రాతి మనుషులు వీరు,
నమ్మకాన్ని నవ్వులపాలు చేసే కపట నాటక సూత్రధారులు వీరు!
జాగ్రత్త మిత్రమా.. ఈ లోకం నిండా ముసుగులే,
మనుషుల కంటే ఇక్కడ మౌనమే చాలా మిన్న!
