షడ్రుచులు
షడ్రుచులు
ఆరు రుచుల సంగమం
అదే జీవిత పరమార్థం
తీయతీయని బాల్యం
భయమన్నది లేని దైవత్వం
వగరుగా పొగరుగా యవ్వనం
చిగురులు తొడిగే చిలిపితనం
పుల్లని చల్లని కోర్కెల కాపురం
పిల్లా పాపలు పుట్టే కాలం
కారం కారం ఈ సంసారం
అయినా వదలని మమకారం
ఉప్పందించే సాయంకోసం
ఉస్సురంటూ సాగే ప్రయాణం
చేదు చేదుగా వృద్ధాప్యం
తాత్త్విక చింతనతో బ్రతికేద్దాం
ఆరు రుచులతో జీవనం
ఆ పరమాత్మే మన గమ్యం.//
