విజయము
విజయము
ॐॐॐ
श्री गुरूभ्योनमः
श्रीमात्रेनमः
మత్తేభము
పరమానందము గల్గు నమ్మ! శుభమౌ భాషాస్వరూపా! ప్రదీ
ప, రసానందము నింపకావ్యములు నో పారాయణీ! భారతీ!
కరుణా దృష్టిని బంచుమమ్మ, నను నీ కాలాని జీవించగాన్
వరదాయీ! వినయంబుతో గొలుతునే! వాణీ! రమాసేవితా!!
@చావలి బాలకృష్ణవేణి
14::02::'23
