వేసవికాలం
వేసవికాలం
వేసవికాలం.
(గేయం )
భగభగ మండెడి భూగోళం
సెగలను చెరగగ భయానకం
వచ్చిందిదిగో ఇప్పుడే వేసవికాలం
ముచ్చెమటలలో మునిగే కాలం
నీటి జాడకై నిత్యం పోరాటం
కాటు వేసెడి కరువు కాటకం
వడ దెబ్బలతో బెదిరే కాలం
కడివెడు నీళ్ళే దొరకని కాలం
పసుల పక్షులకు ప్రాణభయం
వాసము లేక పరిగిడు కాలం
కరెంటు కోతకు కనలెడు కాలం
వరండాలలో తిరిగెడు కాలం
పిల్లా జెల్లకు సెలవులిచ్చేశాం
తల్లుల చాకిరి పెరిగిన కాలం
చల్లని పానీయాలు త్రాగే కాలం
జిల్లను ఐస్క్రీము లమ్మే కాలం
ఆవకాయల నిపుడు పెట్టే కాలం
తీయమామిళ్ళను కొని తెచ్చే కాలం
ఎండలలో దప్పిక నొందెడి ప్రజానీకం
కుండ నీటితో సామాన్యుల సహవాసం
ఓట్ల కోసమై నాయకుల ఆరాటం
నోట్లు పంచెదరని జనుల కాశాపాశం
ప్రగతి ఎక్కడో యని ప్రశ్నార్థకం
సాగుచుండునీ కాలమనంతం.//
