ఆడబిడ్డలు
ఆడబిడ్డలు
ఆడబిడ్డలు
(పద్యమాలిక )
పత్నికి తన దేహమొసగె పరమ శివుడు
మదిని లక్ష్మిని నిల్పెనా మాధవుండు
వాక్కు నందున చోటిచ్చి బ్రహ్మ మురిసె
సతిని ప్రేమించి విధులను సల్పుచుండి
గౌరవించిరా వేల్పులా కాలమందు.
కలియుగంబున స్త్రీలను కష్టపెట్టి
కట్న కానుక లంచును కనలు చుండి
విలువ తగ్గించ తరుణులు బెంగపడిరి.
కష్టముల్ పడు ముదితలు కాల గతిని
నిబ్బరముగా చరించుచు నిష్ఠ తోడ
సకల విద్యలు నేర్వగ సాగుచుండ్రి.
ఆధునిక కాల మందునీ యతివలెల్ల
పెద్ద చదువులన్ జదువుచు పేరుపొంది
రాచకార్యముల్ జరుపంగ రాణులగుచు
పురుష ధృక్పథంబున మార్పు మొలిచె నిపుడు.
మహిళలకు సాయ మందించి మమత జూపు
పుణ్య పురుషులు పుట్టిరీ పుడమి యందు.
గృహము నేలెడి రారాణి పృథ్వి యందు
ఖ్యాతి నొందగా జాతిలో కలిమి కురియు.
ఆడబిడ్డలన్ జదివించ నంతులేని
సౌఖ్య సంపదల్ వరలంగ శాంతి కలుగు.//
