బాలరాముడు
బాలరాముడు
బాలరాముడు.
(ద్విరదగతి రగడ )
ఏలనీ జగంబుల నినవంశదీపకుడు
బాలరాముడు వచ్చె భరతభూమికి నేడు
పూలతో కొల్వగా పుణ్యాల నిడుచుండు
దేవాధిదేవుండు దీనార్తి హారుండు
శ్రీరామ యని బిల్వ శ్రేయంబు జేకూర్చు
కారుణ్య వారాశి కరుణతో దరిజేర్చు
పరువెత్తి వచ్చునా భక్తపరాధీనుడు
పరమాత్ముడీతడే వరంబుల నిడువాడు
జీవాత్మకుని దల్చ చింతలను పరిమార్చు
పావనంబౌ మూర్తి పాపాలు తెగటార్చు
చిఱునవ్వుతో నిల్చి చిత్తంబులను దోచు
వెఱపులే తొలగించి ప్రేమలను గురిపించు
పాదాల పై బడిన పరమును జూపువాడు
పేదసాదల బ్రోచి ప్రీతిని పంచువాడు
ఘనమైన రామునిని కనులార గాంచండి!
ప్రణతితో స్తుతియించి పలుమారు మ్రొక్కండి!
జయమంచు శ్రీరామ చరితనే పాడండి!
దయామయుని చందము ధరణిలో మెలగండి!//
