నీ ప్రేమకై నా నిరీక్షణ
నీ ప్రేమకై నా నిరీక్షణ


నీ నవ్వుల జాబిలి, సాగిపోయే ఊహల పల్లకి
నీ మనసు ఓ పూల వనం, పరిమళించే వెన్నెల చల్లదనం
నీ గుండె చప్పుడు, మోగించినులే నా గుడిగంటలు
నీ నడక సవ్వడులు, తెలిపినులే నా చేలి రాకకై
నీ కనుల కదలికలు, నన్ను మైమరిపించే ఊహల కలలు
నీ కాలి మువ్వలు, రమ్మని చెప్పనులే నీ దరి చేరుటకు
నీ చెవి రింగులు, మదిని దోచే మాయపు ఎరలు
నీ కన్నుల కాటుక చుక్క, మన ప్రేమకు పెట్టిన దిష్టిచుక్క
నీ పెదాల తేనె పలుకులు, గుర్తు తెచ్చేనులే చిన్ని పాపాయి బుజ్జగింపులు
నీ వాలు కురులు, నాపైన కురిసే చంద్ర కేరటాలు
నీ ప్రేమకోసమై సఖియా, నీను పొందేదాకా ఓ చెలియా వేచిచూస్తానే ఎందాకైనా
నీ రాకకై ఓ నా చెలి,పడ్తనే ఓపికా, నా శ్వాస ఉండుదాక.