సుంకేసుల చెట్టు
సుంకేసుల చెట్టు


నిన్నే తలచుకుంటూ పడుకున్నాను
ఏదో పడుతున్న చప్పుడు
ఎండాకాలం మధ్యాహ్నంలా అనిపించింది నువ్వు దూరమైనప్పుడు
ఉన్నట్టుండి వర్షాకాలం వచ్చేసింది
కిటికీ కాస్త తెరచి ఉంది
చిరు జల్లుల వాన తుంపర కిటికీ నుండి
నన్ను తాకాలని తపన పడుతోంది
నేను కిటికీ ప్రక్కకు తిరిగి పడుకున్నాను
ఆ వేప చెట్టు పక్కన ఉందే సుంకేసుల చెట్టు
దాని దగ్గరికి జంట పక్షులు వచ్చాయి
నువ్వు నేను ముద్దులాడుకుంటామే
అచ్చు అలాగే ఆటలాడాయి
నాకేమో నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపించింది
నువ్వు లేవు
వస్తావో రావో తెలియదు
ఇటు తిరిగి నీ ఫోటో ఉన్న ఫ్రేముని తడిమాను
కోప్పడకు
నీకిష్టం లేదుగా ముద్దు పెట్టలేదు
నా కళ్ళు తుడుచుకున్నా
నీ రాకకై ఎదురు చూస్తున్నాం
నేను ఇంకా సుంకేసుల చెట్టు
తిరిగి వస్తావా ప్రియ నేస్తమా