Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

gowthami ch

Drama


3  

gowthami ch

Drama


తల్లి ప్రేమ

తల్లి ప్రేమ

1 min 301 1 min 301

మారవు ఈ జీవిత కథలు తీరవు ఈ జీవన వ్యధలు...

ఒకవైపు మనుషులలో దాగి ఉన్న మానవ మృగాలు రాబందుల్లై పీక్కు తింటుంటే...

మరోవైపు మనుషుల ప్రాణాలను వేలం వేసి మాతృ ప్రేమకు వెల కడుతున్నారు...

సుఖాలకి మరిగి ఆ సుఖాలను అందజేసిన బంధాలను మరిచి జీవచ్ఛవాలుగా మారుస్తున్నారు...

మారవు ఈ జీవిత కథలు తీరవు ఈ జీవన వ్యధలు...

కడుపున పుట్టిన బిడ్డలే కడుపు కాలుస్తుంటే కన్నీరైన ఆ కడుపులోనే దాచుకుంటారు కన్న వాళ్ళు...

గోరుముద్దలు పెట్టి పెంచిన బిడ్డలే గొడ్డలి గా మారి బాధిస్తుంటే ఆ పోటు ని సైతం ప్రేమగా స్వీకరిస్తారు....

కాళ్లు కందకుండా కాపాడుకున్న బిడ్డలే కాలిముల్లై దిగబడుతుంటే ముల్లును సైతం పువ్వుగా స్వీకరిస్తారు ఆ ప్రేమ మూర్తులు...

మారవు ఈ జీవిత కథలు తీరవు ఈ జీవన వ్యధలు...Rate this content
Log in

More telugu poem from gowthami ch

Similar telugu poem from Drama