STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

నా వాకిట్లో రాతిరి

నా వాకిట్లో రాతిరి

1 min
275

నిశ్శబ్దాన్ని మోసుకుంటూ

తెగిన ఉసుర్ల రెక్కల పైన గాలి వీచింది

శీతాంశురేఖ తళుక్కున మెరిసి

నల్లటి మబ్బుల చాటున దాగింది


తెరిచి ఉన్న తలుపులు

ఎన్నడూ మరో మనిషికి స్వాగతం పలకలేదు

కలిసిన మనసుల కోటి తలపులు

కన్నీటి బిందువుల్లో ఆహుతి అవడం మాత్రమే అవి చూశాయి


ఈగ ఒకటి ఎండిన టీ కప్పు మీద కూర్చుంది

ఇక ఎన్నో ఈగలు వస్తాయనుకున్నాను

అవి టీ కప్పు చుట్టూ ముసురుకున్నాయి 

అచ్చుం నీ జ్ఞాపకాల్లాగా

నన్ను ముసురుకుంటూ

యవ్వనాన్ని నీరుగారుస్తూ

ఇలా మేలుకొమ్మన్నాయి

అలా బ్రతకమన్నాయి


మరో పగలు ఉంది

అదే ధైర్యం

కానీ మళ్లీ నా వాకిట్లోకి రాత్రి వస్తుంది

నిశ్శబ్దపు శబ్దాలను నాకు పరిచయం చేసేందుకు

నా మీద నాకు జాలి కలిగించేందుకు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract