STORYMIRROR

Keerthi purnima

Drama Classics Inspirational

4  

Keerthi purnima

Drama Classics Inspirational

కాల చక్రం_జీవిత చక్రం

కాల చక్రం_జీవిత చక్రం

1 min
507


కదులుతున్నది కాలచక్రం 

చక చక మని...పద పద మని

అలుపు లేదు!!

సోలుపు లేదు!!

ఓ క్షణమైనా ఆగేది లేదు!!

సాగుతున్నది ప్రస్తుత నా కాలం!!చక్రాల కుర్చీలో!!


కోయిలమ్మల వదలలేదు!!

రెక్కలు పట్టి బందించలేదు!!

కుటుంబ బాధ్యతల నడి ఒడ్డులో

సంతోషాలకు నిప్పుని పెట్టీ

చలి మంటలుగా మలిచాను!!


అలసిన ప్రాణాలకి

కావాలి కాసింత సాయం!!

పట్టుక పోలేని మూటల

కొరకు కాదు నా తాపత్రయం!!

కోరేది ఎం లేదు

కాసింత సమయం!!


వృద్ధాప్యం_కారాదు వృధా ప్రాయం

మార్చుకోవాలి దాన్నో అనుభవసారం!!

వృద్ధాప్యం_కారాదు అపరాధం

కోరేది కాసింత మమకారం!!

వృద్ధాప్యం_కారాదు వ్యధల బరితం

ప్రతి వాడు చివరికి చెరవలసిందే ఆ గమ్యం!!

గుర్తిస్తే రాదు లోకాన ఏ ఆటంకం....

లేదంటే మన జీవితాలకి తప్పదు అదోగతం!!



 


Rate this content
Log in

Similar telugu poem from Drama