వ్యవసాయానికి లాక్ డౌన్
వ్యవసాయానికి లాక్ డౌన్
వ్యవసాయానికి లక్డౌన్
నిన్ను కన్న తల్లిని పోషిస్తున్నవు
అని విర్రవీగకన్న
నిన్ను పోషించే రైతన్నని మాత్రం
ఎందుకు పట్టనట్టు చూస్తున్నావన్న
పది మంది కడుపులు నింపి
పస్తులుంటున్నడు రైతన్న
తను గనుక లాక్ డౌన్ చేశాడంటే
కరోనా కంటే ప్రమాదకరమన్న
రైతన్న లేకపోతే మెతుకు లేదన్న
మెతుకు లేకపోతే మనకి బ్రతుకె లేదన్న
అన్నదాత రైతన్న ఇంటిపేరు
ఆకలి రైతన్న సొంత పేరు
రైతన్న పడని కష్టం లేదన్న
రైతన్న చూడని నష్టం లేదన్న
రైతన్న చూడని చావులేదన్న
మనకు అన్నం గురించి ఎదురుచూసే రోజు వస్తే తప్ప
రైతన్న విలువ తెలియదేమొనన్న
గుర్తుంచుకో ఇకనైన
రైతు ని గౌరవించడం
నేర్చుకుందామన్నా
నీ త్యాగానికి పాదాభివందనం
అందుకో ఓ రైతన్నా...🙏
పేరు :గాజుల హర్షిత
తరగతి :8 వ
ఊరు : గోపాల్ నగర్, మంచిర్యాల
రెబ్బెన గురుకుల బాలికల పాఠశాల
