STORYMIRROR

Keerthi purnima

Classics Inspirational Others

4  

Keerthi purnima

Classics Inspirational Others

అమ్మ అయితే కానీ తెలియలేదు!

అమ్మ అయితే కానీ తెలియలేదు!

1 min
223


ఆరు దాటితే ఇంట్లో ఉండాలంటుంది

మా అమ్మ మహ పిరికిది!!

ఒంటరిగా ఎక్కడికి వెళ్లదని వాదిస్తుంది

మా అమ్మ మహ భయస్తురాలు!!

అందరినీ త్వరగా నమ్మద్దనంటుంది

మా అమ్మ మహ అనుమనస్తురాలు!!

అర్ధ రాత్రి వరకు చదవద్దనంటుంది

చదువు విలువ తెలియని నిరక్షరాస్యురాలు!!

అవును ...నిజమే..!!

కానీ నేను అమ్మనైతే కానీ తెలియలేదు

సమాజాన్ని నమ్మలేక తాను కంచెలా మారిందని!!

పురిటి నొప్పులతో చచ్చి బతికిన అమ్మ

లోకం లో అందరికంటే ధైర్యవంతురాలని!!

అది అనుమానం కాదని ఏ హానీ జరగకుండా

జాగ్రత్త పడే మమకారమని!!

సమాజాన్ని చదివిన అమ్మ

నిరక్షారాస్యి కానే కాదని!!

నా ఆరోగ్యం కాపాడే వైద్యురాలనీ!!

వద్దన్న బలవంతంగా కడుపు నింపే అన్నపూర్ణనీ!!


Rate this content
Log in

Similar telugu poem from Classics