STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

'హరీ!'శతకపద్యములు

'హరీ!'శతకపద్యములు

1 min
1

47.

చంపకమాల.


తురగపు రూపుడా ఖలుడు దుర్మతుడై నిను జంపబోవగన్

జిరజిరలాడి వాని నట సింహపు పిల్లవిధంబు జీర్చగన్

బరుగున వచ్చి గోపకులు 'వహ్వ!'యటంచు జయంబుపల్క నిన్

మురియుచు గాంచుచున్ సురలు మ్రొక్కిరి పొంగుచు భక్తిగన్ హరీ!//


48.

ఉత్పలమాల.


చీరలు దోచి భామలను జేరగ రమ్మని మోక్షమార్గమున్

దీరుగ దెల్పినావు నిను 'దేవర!'వంచును మ్రొక్కిగొల్లెతల్

కోరగ నీదు సంగతిని కూరిమి మీరగ తీర్చినావు నిన్

సారెకు దల్చి వేడెదను జ్ఞానపు భిక్షనొసంగుమా హరీ!//



Rate this content
Log in

Similar telugu poem from Classics