STORYMIRROR

Midhun babu

Romance Classics

3  

Midhun babu

Romance Classics

ప్రేమ మనసులో

ప్రేమ మనసులో

1 min
6

ప్రేమ మనసులో ఉంది 

బయటకు అస్తమానూ 

చూపించాలా అంటే

అప్పుడప్పుడూ అయినా

నువ్వంటే నాకిష్టం అని చెప్తే 

మనసుకి ఎంత బావుంటుంది..?

ఎంతసేపూ ఒక్కరే చెప్తూపోతే..!!

లోకువ అవ్వడమేనేమో 

అని అనిపిస్తూవుంటుంది

రెండు చేతులూ కలిస్తేనే శబ్ధం వస్తుంది

రెండు మనసులూ మాట్లాడుకుంటేనే

బంధం బిగుస్తుంది

అలక్ష్యం చేస్తే గొడవలేమీకావు కానీ...

విసుగుచెందిన మనసు నిరాశతో

నిశ్శబ్దంగా నిష్క్రమించే ప్రమాదముంది

తస్మాత్ జాగ్రత్త సుమా...

ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమించండి

పోయాక జ్ఞాపకాలను కాదు....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance