STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మట్టి దీపం -మనిషి తీరం

మట్టి దీపం -మనిషి తీరం

1 min
1


చెక్కిన శిల్పం కాదు నీ రూపం,
క్షణాల తెరపై కదిలే నీడల చిత్రం!

తీరం చేరే లోపే చెదిరిపోయే కెరటం,
ఎందుకయ్యా మనిషీ నీకింతటి మమకారం?

ఆశల రెక్కలు కట్టుకుని ఆకాశాన ఎగురుతావు,
ఆరడుగుల నేల కోసమే ఈ పయనమని మరచిపోతావు.

‘నేను.. నాది’ అనే అహంకారపు తెరలలో బందీవై,
తోటి ప్రాణం రోదనను చూడలేని గుడ్డివైపోతావు.

సిరుల మూటలు మోసే ఆరాటంలో
స్వచ్ఛమైన చిరునవ్వు విలువను విస్మరిస్తావు.

గెలుపుల వెంట పరిగెత్తే వేగంలో
నీ గుండె లోపలి నిశ్శబ్దాన్ని పోగొట్టుకుంటావు.

వచ్చేనాడు చేతుల్లో ఏమీ రాలేదు,
వెళ్ళేనాడు నీ వెంట ఏదీ రాదు.

మధ్యలో దొరికిన ఈ కాసింత కాలంలో
ద్వేషపు నిప్పులతో ఎందుకు దహించుకుపోతావు?

ఎండిన పెదవులపై చిన్న ఓదార్పువై నిలువు,
కష్టంలో ఉన్న గుండెకు కొండంత అండవై నిలువు.

ఈ దేహం రేపు నేలలో కలిసిపోయినా,
నువ్వు పంచిన ప్రేమ రూపంలో
మనిషిగా కలకాలం బతికే ఉంటారు...!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics