STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నీ తలపే

నీ తలపే

1 min
2



శ్వాసలకే శ్వాసపూల..గొడుగైనది నీ తలపే..!
అక్షరాల ఒకవెన్నెల..మధువైనది నీ తలపే..!

మంత్రమేమి జపించనిక..మనసుకట్టి పడేస్తే..
నా తాపం చల్లార్చే..వెలుగైనది నీ తలపే..!

గుండెసడిని నిలిపేసిన..నవ్వులనది చూపనెలా..
నా పాటను ముద్దాడే..మెఱుపైనది నీ తలపే..!

ప్రేమతడిని బతికించే..నాదమెంత మనోహరం..
నానిద్దుర మెలకువలకు..తోడైనది నీ తలపే..!

ఆశపడే ముచ్చటలకు..సెలవెలాగ ఇవ్వాలో..
నా కోర్కెల కొండ కూల్చు..శరమైనది నీ తలపే..!

మాయపట్టు వదిలించే..మోహినివని ఏం చెప్పను..
నా వేదన పరిమార్చే..నిప్పైనది నీ తలపే..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics