STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Romance

5  

Venkata Rama Seshu Nandagiri

Romance

మనప్రేమ

మనప్రేమ

1 min
289

ఓ చెలీ, నాకై నీవు పంపిన ఆన్లైన్లో ప్రేమకావ్యం,

చదివాను, నీవు చెప్పిన ఆ ఆరవ అధ్యాయం,

ఆ ఇరువురి ప్రేమ కథ ఎంతటి సుమధురం,

మన ప్రేమ వలె అనిపించినది కడు రమ్యం.

ఆ కావ్యంలో నీ పలుకులే పదాల చినుకులుగా,

నీ యందు నా ప్రేమ కవితల కాలువలై పారగా,

ఆ ప్రేమ ఝరి వెల్లువగా మారి పొంగి పొరలగా,

ఊహలతో నిండిన కలల్లో నీవే సాక్షాత్కరింపగా.

హృదయాన్నే చేసి ఒక బంగరు పళ్ళెరముగా,

నా కలల తొనలను, అందు పేర్చి రమ్యముగా,

హృదయ దేవేరికి సమర్పించా నైవేద్యముగా,

నీపై నాప్రేమ, కన్నుల నిండుగా ఉప్పొంగిపోగా.

నీ అందమైన చేతులు తాకె, కలల తొనలను,

ప్రేమతో వాటిని, నీవు స్వీకరించుట తోను,

పళ్ళెరమను ఖాళీ హృదయము మిగిలెను,

ఐనను స్వీకరించెద, నీ భావాలే బ్రేక్ ఫాస్ట్ గను.


Rate this content
Log in

Similar telugu poem from Romance