STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Romance

5  

Venkata Rama Seshu Nandagiri

Romance

హంసరాయబారం

హంసరాయబారం

1 min
388

చల్లని వెన్నెలలో, చంద్రకాంతి లో

తళుకులీనుచూ, పుత్తడి బొమ్మలా

ప్రియుని రాకకై వేచియున్న విరహిణిలా

నతవదనయై చింతించు చున్నది మదిలో


రాయబారమంపినది హంసతో

తిరిగి రాలేదు ఎటువంటి జాబుతో

మనసంతా నిండిపోయె వేదనతో

తనువంతా వేగిపోయె విరహంతో


చెంతనున్న హంసని కౌగిట హత్తుకొని

తన వేదనంతా, దానికి నివేదించుకొని

రాయబారికై ఒడలంతా కనులు చేసుకొని

వేచియున్నది కాంత కనుల నీరు నింపుకొని


అంతలో ఒక హంస వచ్చి తనచెంత వాలెను

అది కని వదనము, కమలము వలె విరిసెను

ప్రియాగమన వార్త విని, ఎదలో హర్షము రేకెత్తెను

అందమైన ఆమె మోము నగవులు చిందించెను.


Rate this content
Log in

Similar telugu poem from Romance