Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

పోయిరా

పోయిరా

1 min
285


పోయిరా పోయిరా ఇదికూడ పొసగని వైనం

చేయకురా యత్నం ఆ మనసే కరగని మైనం

ప్రేమంటే రెండు హృదయాలలో వెలిగే దీపం

అవునంటే కాదనే తత్వమా వదలుకో కోపం


పొడి మాటలతో తడి మంటలూ పుట్టిస్తావు

పుప్పొడి వనాలలో అగ్గితోనే ఆట పట్టిస్తావు

చిగురించే చిత్రమైన వలపును చీత్కరిస్తావు

రగిలించే రాక్షసమైన ఆ స్పర్థనే సత్కరిస్తావు

పోయిరా పోయిరా ఇదికూడ పొసగని వైనం

చేయకురా యత్నం ఆ మనసే కరగని మైనం


రాలుగాయి ప్రేమకూ రాపిడి మరీ అధికమూ

కాలు చేయి కదలనీక కట్టివేసేసి ఓ పధకమూ

గుడ్డి ప్రేమకు గుండెలు అర్పణమూ చేయాలా

నడ్డి విరిచి నవ్వేసే పరిహాసాన్ని పిలిచేయాలా

వలపుకూ వ్యామోహానికి వంతెన కట్టలేవుగా

తలపులో నిత్యమే నిలువనిచో చేపట్టలేవుగా


పోయిరా పోయిరా ఇది కూడ పొసగని వైనం

చేయకురా యత్నం ఆ మనసే కరగని మైనం


కథలలోన చదువలేదా కనికరమేలేని గాధలు

వ్యధలపాలై కథలగా చెప్పలేదా ప్రేమబాధలు

కథలలోన చదువలేదా కనికరమేలేని గాధలు

వ్యధలపాలై కథలగా చెప్పలేదా ప్రేమబాధలు


పోయిరా పోయిరా ఇదికూడ పొసగని వైనం

చేయకురా యత్నం ఆ మనసే కరగని మైనం

ప్రేమంటే రెండు హృదయాలలో వెలిగే దీపం

అవునంటే కాదనే తత్వమా వదలుకో కోపం



Rate this content
Log in