తనువును
తనువును
తపిస్తున్న ఈ తనువుని అల్లుకొనుట తెలియదేమి
పెంచుకున్న కోరికలను దరి చేర్చుట తెలియదేమి
కలలుగనే రెప్పలపై నర్తించుట తెలియదేమి
కనుపాపలలో కళలను హెచ్చించుట తెలియదేమి
అడగని గాలికి శ్వాసలు ఎన్ని వరములిస్తాయో
అడిగిన నా ఊపిరిలో వ్యాపించుట తెలియదేమి
వయసొచ్చిన నదులన్నీ నీ మేనికి ఉపనదులే
దప్పిగొన్న పెదవులపై ప్రవహించుట తెలియదేమి
సత్యభామవైన నిన్ను రుక్మిణివని భ్రమించాను
బతిమాలే నీ కృష్ణుని మన్నించుట తెలియదేమి
ప్రణయవీణలా ఉంటే వేలికొసలు ఊరుకోవు
రాత్రివేళ సరసంలో శ్రుతిమించుట తెలియదేమి
కౌగిలింతలో గాలికి చోటీయక
సమరంలో వియోగాన్ని ఓడించుట తెలియదు

