సేదతీరు ప్రియతమా
సేదతీరు ప్రియతమా
ఎదురుచూపుల వేళ ఇది తోడునడిచే నీడకోసం...!
తడబడని కన్నుల చూపు ..ఇది జాడ లేని నీడకోసం...!
తరలిరాని తరుణమిది తరిగిపోని ప్రేమ కోసం...!
అరక్షణమే ఆగిపోదా మరుక్షణమే మరలిపోదా...!
నువు పిలిచిన ఆ క్షణమే...
మధురమైన ఆ క్షణం... మరువలేను ప్రతిక్షణం...!
అనుక్షణం నీ ధ్యాసే అనుక్షణం నీ తపనే...!
నన్నిక్కడ ఈ కొలనులో....నిట్టూర్చింది...!
ఓ ప్రియతమా... నా మధురమా..!
నన్ను పరీక్షించకుమా...!
నేను ఆత్మీయంగా ప్రేమించే ప్రాణమా!
నా హృదయ కౌగిలిలో వాలిపోవా...!
నీ బాహ్య ప్రపంచం మరిచిపోవా..!
నను చేర... రావా...!
నా మది( బిగి కౌగిలిలో) గుప్పిట్లో...
సేద తీరు...ప్రియతమా...!

