స్నేహితుడా
స్నేహితుడా
నేను ఏమి చేస్తున్నా..చూస్తూనే ఉంటావా..!
కలలోనూ నన్నల్లరి..పెడుతూనే ఉంటావా..!
ఎంత కొంటెతనం నీది..గాలిలోని పరిమళమా..
పగలురేయి అలా వెంట..పడుతూనే ఉంటావా..!
నా కనులకు రానీవే..నిదురతెరను ఏ వేళా..
చెలిమిమీర చేరి వెన్ను..తడుతూనే ఉంటావా..!
శ్వాసమాటు మనసుపట్టి..ఎలా ఖాళి చేసేవో..
నా తలపుల కావ్యమొకటి..వ్రాస్తూనే ఉంటావా..!
కిరణం పై తిరగబడే..చీకటెలా నిలువగలదు..
నీ అజ్ఞానపు సొగసులు..మోస్తూనే ఉంటావా..!
చూడ చక్కనౌ హితుడా..స్నేహితుడా ..
మనసుచిలుకకో సంకెల..వేస్తూనే ఉంటావా..!

