Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

కాలం గడిచిపోతుందీ

కాలం గడిచిపోతుందీ

1 min
446


ప౹౹

ప్రియతమా కాలం గడిచిపోతున్నది జాడేది

సమయమా కలసిరా ఓ పూలే కాదే వాడేది |2|


చ||

వేచిన మనసుకు వేకువ ఎప్పుడే ఏతెంచేనే

దాచిన వలపే దాపరికాన్ని పూర్తిగా తెంచెనే |2|

ముద్దు ముచ్చటలకే అదునూ తానవునంది

పొద్దు వాలక మునుపే మురిపెమే పోనుంది

|ప|


చ||

మిగిల్చిపోవా నెమరించను తీపి జ్ఞాపకాలు

వచ్చిపోవా వరసైన వేళలో తీర్చ వేడికోలు |2|

కొసరి కోరికేమో కొండెక్కనుంది మరికోరకనే

సరిచేయను సరసము కోరదుగా మరొకరినే

|ప|


చ||

ఎద మొత్తం వెలితాయే ఎడబాటునే తలచి

మదిలోని ముసిమి మసకబారే నిను కొలిచి |2|

తూర్పు భాను కిరణంలా నీవు ప్రభవించవా

మార్పునే తెచ్చి మరులుకాంతి వెలిగించవా

|ప|


చ౹౹

కాలమూ కలసి వచ్చి కమనీయమే చేయగ

వాలకం వలపునే ఎంచి వాంచనే పెంచేయగ ౹2౹

జంటగా రమ్మనే కోరికనే ఎలాగు ఆపగలేను

ఒంటరిగా మొదటి రాత్రి నేనేమో ఓపగలేను ౹ప౹


Rate this content
Log in