ఆరాధన...!!
ఆరాధన...!!
"" ఆరాధన ""
బాపు గీసిన బొమ్మ నీవట బ్రహ్మ చెక్కిన శిల్పమేనట....
నలుపు తెలుపుల వంపు వలపుల మైమరపు గొల్పు మేను నీదట.....
నీ కురుల చాటున రేత్రి దాగున.....
కనులు కాదవి తకుకు బెళుకు న మెరిసే నక్షత్రాలు అవి.....
అంచు అంచున ఎరుపు కానన...నీ పెదవి అంచున మాట దాగున...
తేనె పలుకుల స్వరము నీ వరం....
హంస నడకల అందం నీ సొంతం....
చాటు చాటున నిన్ను చుసిన కలిగే లోపల విస్ఫోటన...
కళ్ళు మూసిన నీవేనట....నా కళ్ళ ముంగిట నిలిచెనట....
కలలు కాదవి నా గుండె లోపల అలల అలజడులు అవి...
నా మనసు మాటున ఉన్న మాట పలకన....
నీ రాక కే నే వేచి ఉన్న...
నువ్వు లేని జీవితం ఓ నరక యాతన....
కష్టమనిపించే ఇష్టమైన వేదన....
నిన్ను చేరేందుకు నేను పడే ఆ ఆవేదన......
నా గుండె నిను చేరు వరకు చేస్తాది ఈ ఆరాధన....!!!