ఆవేదన...!!
ఆవేదన...!!
"" ఆవేదన... ""
ఏమని చెప్పను ఏదీ అని చెప్పను...
తెలుగు సాంప్రదాయాపు దీపం నువ్వని చెప్పనా ..??
నీ కన్నుల అంచుల గల నలుపు కాటుక నన్ను మాటి మాటికి కాటు వేసేనని చెప్పనా...??
పూల మనసున ప్రేమ మాటున ఘాటు కోపం నీదని చెప్పనా....??
మధురమైన నా కావ్యం నువ్వని చెప్పనా..??
ఇంత అని చెప్పగలనా.....అంత అని చెప్పగలనా....??
మనసు మాటున గల ప్రేమ కొలత నేను ఎరుగ గలనా???
మబ్బు మాటున వర్షం ఆగునా ....?? నిన్ను చూడక నేను ఉండగలనా??
నా గుండె లోపల దాగిన నీ గుండె పదనిసలు పలికిన క్షణమిది అని చెప్పగలనా....??
అందం అది మకరందమది నా మదిని తాకిన ప్రేమ అలజడి నీది....
ఆగదు ఇది అసలాగదు ఇది సముద్రపు అలల వలె పొంగేటి ప్రేమ నాది....
అమ్మ ప్రేమ కమ్మదనం నీ ప్రేమ తోడై చేసే అమోఘం....
నన్ను తెలిసిన నువ్వు ,నా అర్తము ఎరిగిన నువ్వు, నా అర్థాoగి వై నా ప్రేమ కరువుని కరుణించే వర్షపు చినుకువని ఊహించగలనా.....???
సూర్య కాంతికి మధురమైన నువాసన జల్లే శక్తి ఉంటే లోకం అంత పరిమలభూషిత ప్రకాశము నిండిన ఆనంద లోకం అని అనడం అతిశయోక్తి కాదు కాదా.....!!
ఆ మధురం నీవే అని నేను గ్రహించగలనా???
నువ్వు నిజం నేను నిజం మన మధ్య ఉన్న సూన్యం ఒక మహా ప్రపంచం....!!
కనిపించని ఓ మహా సంగ్రామం....!!
ముగింపు లేని ఓ ఏడారి ప్రయాణం....!!!!