వేదన...!
వేదన...!


'వేదన'
ప్రతి క్షణం ఒక యుగం.....
నిన్ను విడిచిన తరుణం.....
ప్రతి అడుగు అగమ్యం...
నిన్ను విడిచి వెళ్లే నా పాదం....
నా ఎద ఓ కన్నీటి సముద్రం...
నిన్ను తలిచే ప్రతి క్షణం....
నాకం ఏది ఇక నరకం...
సుఖము లేదిక శోకం....
మోయలేని భారం....
మరువలేని తీపి జ్ఞాపకం....
వీడలేని మధుర బంధం......
నువ్వు కాన రాక నా ప్రపంచం అంధకారం....
నీ మాట వినక మూగబోయెను నా స్వరం....
నువ్వు లేని జీవితం...
ఒక ప్రాణం లేని జీవం....
నీ జ్ఞాపకాలతో నే చేసే ఒంటరి పోరాటం...
'నేను' లో
'నే' మాత్రమే మిగిలన సత్యం ...
'ను' అనేది అసత్యం..
'మనం' అనేది ఒక మాయా బూటకం....
నీ చూపు...నీ పలుకు...
నీ నవ్వు...నీ స్పర్శ...
నీ మనసు...నీ ప్రేమ..
నీ కోపం..నీ చిరాకు..
నీ భయం..నీ అసూయ..
నీ అందం...నీ సొగసు...
ఇవే నాకు ఊపిరి....
శ్వాసించకుండా ఎలా ప్రియా నేను జీవించేది...!!!