STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

కాలం

కాలం

1 min
130


కాలం అనే గురువు నేర్పు పాఠాలు నేర్చుకోవడం తప్పుకాదే

ప్రకృతి సోయగానికి మైమరచి నాట్యం నేర్చుకోవడం తప్పుకాదే


వెండి వెలుగులు వెన్నెల దీపమా వెలుగును పంచ రావుకదా

అమ్మ జోలపాట కమ్మదనం వినిపోవడం తప్పుకాదే


 అందనంత ఎత్తు ఎదగడానికి ఆశయం ఒకటి చాలు కదా

గెలుపు బాటలో అలుపు లేకుండా నడుచుకోవడం తప్పుకాదే


మానవత్వం పరిమళించే రోజు వికాసం వెలుగు కదా

ఆపదలో ఉన్నవారిని కరుణతో ఆదుకోవడం తప్పుకాదే


తిరిగి రాని క్షణం కోసం ఎదురుచూస్తున్న ఫలితం శూన్యం కదా

బాధలు అన్నీ మరచి పోయి కొత్తగా మలుచుకోవడం తప్పుకాదే...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance