రాత్రంతా
రాత్రంతా
రాత్రంతా తలను మోసి
తన తలపులతో జోడీ చేసి
కలలను తనకు కానుకగా అందజేసి
కలతల కన్నీళ్ళు లోలోకి ఇంకేలా చేసి
తడిలేకుండా చెంపలను తుడిచి
మెత్తని ఆసరను ఇచ్చి
మత్తైన జోల మౌనంగా పాడి
జోకొట్టి నిదురపుచ్చిన తలగడ
కాలం పాడిన సుప్రభాతంతో
తలను తగిలించుకున్న తనువు మేల్కొంటే
తను గాఢనిద్దురలోకి జారిపోయింది
పాపం...!
ఎంతగా అలిసిపోయిందో, తలగడ...!
రాత్రయితే గానీ తిరిగి లేచేట్టులేదు

