STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

అంతా అయోమయం

అంతా అయోమయం

1 min
3



బాల్యమంతా అల్లరితో
యవ్వనమంతా బాధ్యతలతో
గడిచిపోయింది!కాలం విలువ తెలుసుకునే లోగా
పిడికిల్లో ఇసుకలా కాలం
చేజారిపోయింది.ముందంతా
చాలా సమయముంది తర్వాత చూడచ్చులే అని
వెనకేసిన అభిరుచులకు
ఈ మలి వయసులో రెక్కలిప్పుకుంటుంటే
ఒక్కసారిగా ఈ క్షణమే
చివరిదైతే అన్న ఒక్క
ఆలోచన సుడిగాలిలా
చుట్టుముట్టి ఊపిరి
ఆడనివ్వక ఉక్కిరిబిక్కిరి
చేసింది!

నాలోని చిత్రకారుడు,రచయిత,సంగీతకారుడు ఇప్పుడిప్పుడేగా
ముడిచిన రెక్కలిప్పుకుని
బయటకి వస్తున్నది!
సమయం దొరికిందని
ఆబగా నేనేదో చేసేయ్యాలని
ఉబలాటపడుతుంటే
ఊపిరాడని దగ్గు ఉక్కిరిబిక్కిరి
చేసేస్తుంటే,డాక్టరు చెప్పిన
మాటలు చెవిలో మారుమోగుతుంటే !
అమ్మో!ఈ క్షణమే చివరిదైతే
నేనేం చేయగలను రచయితనా,చిత్రకారుడనా,సంగీతకారుడినా!
అంతా అయోమయంలో
పెట్టుకున్నాను ఎదురుగా కాగితాలు రంగులు సంగీతసాధనాలు!
అంతా అయోమయం!


Rate this content
Log in

Similar telugu poem from Classics