STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చీకటి కౌగిలి

చీకటి కౌగిలి

1 min
2



ఎండకు అలసిన శరీరం పై
 ఉప్పుటేరులు పారుతున్నా
బిడ్డల పెదాలపై పూసే నవ్వుకోసం 
తన ముఖానికి సంతోషపు ముసుగు తగిలించుకునేవాడు

కాలం క్లిష్టపరిష్టితులను పరిచయం చేసినప్పుడు
పిల్లల ఆకలి మంటను ఆర్పటం కోసం
తన కాళ్ళు రక్త రహదారులైనా  
పనిని గ్రద్దలా వెతుకులాడే వాడు.
 
అవసరాల కెరటాలు ఎగిసి పడుతున్నా 
మదిలో ఆలోచనా గాలులు తీరం దాటేస్తున్నా
బెరుకును తన ముఖంలో చూడనిచ్చే వాడు కాదు.

బిడ్డల కళ్ళల్లో వసంతోత్సవం చూడటం కోసం 
తాను ఎల్లప్పుడూ శిశిరంతో పోరాడేవారు.

బిడ్డల చిన్ని చిన్న అవసర ఆనందాల కోసం 
తను ఓ డబ్బుల చెట్టులా మారిపోయిన నాన్న
డబ్బులాకులన్నీ ఏరేకొని పిల్లలు వెళ్ళిపోయినప్పుడు
కెరటం విడిచిన తీరంలా
ఒంటరిగా మిగిలిన నాన్న ను
దుఃఖపు చీకటి కౌగిలించుకుంటుంది.



Rate this content
Log in

Similar telugu poem from Classics