STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నేలపాట

నేలపాట

1 min
1


నేలపాట ఎన్నిసార్లు పాడినా తనివి తీరదు
ఎంత కీర్తించినా కొండను అద్దంలో చూపించినట్లే
ఏనుగును చీమంత వర్ణించినట్లే
మట్టితో అనుబంధం, మమకారం అంతటిది
పుట్టిన నాటి నుంచి పేరుకున్నదాయే
మనలాంటి వారెందరున్నా పోయినా
దాని గతి మారదు, భ్రమణం ఆగదు
నేలను వీడి సాము చేస్తే బొక్క బోర్లా పడుడే 

శరీరానికి మట్టంటితే కంగారుపడుతాం
తుడిచేసుకుంటాం, కడిగేసుకుంటాం
ఆరోగ్యానికి చేస్తాం తడిమట్టి స్నానం
మట్టిలోంచి పుట్టిన పంటలే ఆహారాలు 
దూప, ఆకలి తీరక మట్టి విలవిలలాడితే
జీవజాలమంతా తల్లడిల్లాల్సిందే 

నేలను నమ్ముకున్న వాడెవడూ చెడిపోడన్నది సామెత 
ఎద్దుతో ఎవుసం బంధం పుటుక్కుమంది
తీరుమారిన వ్యవసాయం రూపాయి మయమైంది
రియల్ వ్యాపారంలో పొలాల్లో రాళ్లు మొలిచాయి
భూమికి మనిషికి మధ్య లెక్కలు మారాయి 

నేల మనల్ని చెడగొట్టదు
కలుషితాలతో మనమే చెడగొడుతాం నేలను
దాని గోల వినకపోతే
దాంతోపాటు రెంట చెడేది మనమే
తల్లి లాంటి నేలతో చెలగాటమాడొద్దు 

ఎంత గాల్లో సాము చేసినా రావాల్సింది భూమ్మీదికే
పాడెపై చేరాక పయనం స్మశానానికే
పూర్వీకులు, మన మూలాలన్నీ నేలపైనే
భావి తరాల భవిష్యత్తు ఇక్కడే


Rate this content
Log in

Similar telugu poem from Classics