ప్రియా భామిని
ప్రియా భామిని
ఉషోదయపు కిరణాలలొ మెరిసినట్టి ప్రియ భామిని..!...!
చైతన్యపు రథంపైన నిలిచినట్టి ప్రియ భామిని..
నందన వనమున మొలిచిన పరిమళంపు నవతారక..!
పసిడి కాంతి చెక్కిళ్ళలొ చూపినట్టి
ప్రియ భామిని...!
మధుమాసపు కోయిలగా రాగాలై రంజిల్లగ
నయగారపు ఊయలలో ఊగునట్టి ప్రియ భామిని...
ఆత్మ ఙ్ఞాన నివేదనను వినిపించే రాగమయీ,..!
ఆ దేవుని చేరుటకై తిరుగునట్టి ప్రియ భామిని.!..
వెలుగు పులుగు రెక్కలార్చు వేళలోన నీ ధ్యానం..
మనోగీతి శబ్ద శ్వాస పంచునట్టి ప్రియ భామిని..!..
